ముంబయి: రిలయన్స్ జియో త్వరలో రెండు స్మార్ట్ ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నదని తెలుస్తున్నది. అధికారికంగా జియో వెల్లడించకున్నా.. ఆ రెండు ఫోన్లకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్(బిఐఎస్) సర్టిఫికెట్ పొందినట్లు తెలుస్తున్నది. ఈ నెల 28న జరిగే రిలయన్స్ వార్షిక సమావేశం (ఏజీఎం)లో ఈ జియో ఫోన్ల ఆవిష్కరణపై ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది.స్నాప్ డ్రాగన్ 480 ఎస్‌ఓసీ చిప్ సెట్ తో 4జీబీ రామ్ విత్ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో రిలయన్స్ జియో ఫోన్లు వస్తున్నాయని సమాచారం.
జియో స్మార్ట్ ఫోన్లు జేబీవీ161డబ్ల్యూ1, జేబీవీ162డబ్ల్యూ1 అనే పేర్లతో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయని వినికిడి. ఈ నెల 20న జరిగే రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ జియో ఫోన్లపై ఒక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. చౌక ధరకే జియో స్మార్ట్ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉంట్నాయి. జియో ఫోన్ల ధర రూ.8000, 12 వేల మధ్య నిర్ణయిస్తారని సమాచారం.