చెన్నై: ప్రతిష్టాత్మకమైన ఆసియా పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు ట్రోఫీని సాధించింది. శనివారం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో భారత్ 43 గోల్స్ తేడాతో మలేసియాను ఓడించింది. చివరి వరకు సమరం హోరాహోరీగా సాగింది. ఒక దశలో 13 తేడాతో వెనుకబడిన ఆతిథ్య భారత్ అసాధారణ పోరాట పటిమతో మళ్లీ పైచేయి సాధించింది. కీలక సమయంలో మూడు గోల్స్ సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆట ఆరంభంలో భారత్ ఆధిపత్యం చెలాయించింది. 9వ నిమిషంలో జుగ్‌రాజ్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసి భారత్‌కు తొలి గోల్ అందించాడు. అయితే ఈ ఆనందం భారత్‌కు ఎక్కువ సేపు నిలువలేదు. 14వ నిమిషంలో మలేసియా ఆటగాడు అబు కమాల్ అద్భుత ఫీల్డ్ గోల్‌తో స్కోరును సమం చేశాడు.
ఆ వెంటనే రహీం మలేసియాకు రెండో గోల్ అందించాడు. 28వ నిమిషంలో అమీనుద్దీన్ మలేసియాకు మరో గోల్ సాధించి పెట్టాడు. దీంతో ప్రథమార్ధంలో మలేసియా 31 ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత కూడా మలేసియా దూకుడుగానే ఆడింది. భారత్ గోల్స్ కోసం పదేపదే దాడులు చేసినా చాలా సేపటి ఫలితం దక్కలేదు. కానీ 45వ నిమిషంలో భారత్ వెంటవెంటనే రెండో గోల్స్ సాధించింది. హర్మన్‌ప్రీత్ సింగ్, గుర్జంత్ సింగ్‌లు ఈ గోల్స్ చేశారు. ఇక 56వ నిమిషంలో ఆకాశ్‌దీప్ సింగ్ అద్భుత ఫీల్డ్ గోల్ సాధించడంతో భారత్ 43 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరి వరకు ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకున్న టీమిండియా ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది.