- Advertisement -
చెన్నై: భారత హాకీ జట్టుకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకం ప్రకటించింది. ప్రతిష్టాత్మకమైన ఆసియా పురుషుల హాకీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత జట్టు సాధించిన నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ రూ.1.1కోట్ల నజరానా ప్రకటించారు.
కాగా, శనివారం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో భారత్ 4-3 గోల్స్ తేడాతో మలేసియాను ఓడించింది. చివరి వరకు సమరం హోరాహోరీగా సాగింది. ఒక దశలో 1-3 తేడాతో వెనుకబడిన ఆతిథ్య భారత్ అసాధారణ పోరాట పటిమతో మళ్లీ పైచేయి సాధించింది. కీలక సమయంలో మూడు గోల్స్ సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది.
- Advertisement -