అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మంత్రి గుడివాడ అమర్నాథ్ వాసల్ విసిరారు. విసన్నపేటలో తనకు భూమి ఉన్నట్లు నిరూపించాలని డిమాండ్ చేశారు. భూమి ఉన్నట్టు నిరూపిస్తే జనసేనకు రాసి ఇస్తానని సవాల్ విసిరారు. టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దండుపాళ్యం బ్యాచ్ అని , పవన్ జ్ఞానం వచ్చే పుస్తకాలు చదివుంటే బాగుండేదని అమర్నాథ్ వివరించారు. తన అన్నయ్య చెప్పినట్టు ఫేస్ లెఫ్ట్ టర్న్ చేసి ఉంటే గీతం కాలేజీ కనిపించేదని ఎద్దేవా చేశారు. బాబు బంధువు కాబట్టే గీతం వర్సిటీ అక్రమాలు పవన్‌కు కనిపించడం లేదని ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్‌లో చిరంజీవి ఇల్లు కొండపై కట్టలేదా? అని అమర్నాథ్ అడిగారు. పిఆర్‌పిలోకి కోవర్టులను పంపి పార్టీని ఓడించిన రామోజీకి ఎందుకు బానిసగా మారావని ప్రశ్నించారు. చంద్రబాబు, రామోజీకి మించిన స్టువర్టుపురం గ్యాంగ్ ఎక్కడ ఉంటుందని అమర్నాథ్ అడిగారు. పవన్ తల్లిని విమర్శించిన వ్యక్తులకు ఆయన ఎలా ఊడిగం చేస్తున్నావని ప్రశ్నించారు. చంద్రబాబు కోసం కోతిలా పవన్ గెంతుతున్నాడన్నారు.
Also Read: ఒడిశాలో దారుణం: పెళ్లికాని దివ్యాంగుడికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్