Monday, December 23, 2024

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఎయిర్‌పోర్టు అధికారుల కళ్లుగిప్పి విదేశాల నుంచి బంగారం తీసుకుని వచ్చిన వ్యక్తిని ఎయిర్ పోర్టు ఇంటెలీజెన్స్ అధికారులు ఆదివారం పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి కిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తి జెడ్డా నుంచి శంషాబాద్‌కు ఫ్లైట్‌లో వచ్చి బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన తర్వాత ట్యాక్సీ పార్కింగ్‌లో వేరే వ్యక్తులతో అనుమానస్పదంగా తిరుగుతుండడంతో ఎయిర్‌పోర్టు ఇంటెలీజెన్స్ అధికారులకు అనుమానం వచ్చింది.

వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా కిలో బంగారు ఆభరణాలు లభ్యమైనవి.అతడిని విచారించగా జెడ్డా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చానని తెలిపాడు. అక్కడే బంగారు ఆభరణాలు అక్కడ కొనుగోలు చేసి తీసుకుని వచ్చినట్లు చెప్పాడు. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి బయటికి వచ్చినట్లు తెలిపాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News