Friday, November 22, 2024

దేశంలో ఆర్థరైటిస్ 180 మిలియన్లన మందిని ప్రభావితం చేస్తోంది

- Advertisement -
- Advertisement -

బ్యాడ్మెంటెన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్

మన తెలంగాణ/ హైదరాబాద్: దేశంలో ఆర్దరైటిస్ 180 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తోందని, ప్రముఖ బ్యాడ్మెంటెన్ క్రీడాకారుడు పుల్లెల గోపీ చంద్ అన్నారు. యశోధ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఐటీసి కాకతీయలో రెండు రోజుల పాటు జరిగిన జాయింట్ రీప్లేస్‌మెంట్ ట్రాన్స్‌పరెంట్ లైవ్ వర్క్ షాప్ ముగింపు ఉత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ మదుమేహం, క్యాన్సర్ వంటి అనేక వ్యాధుల కంటే ఆర్థరైటిస్‌బారిన పడేవారి సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలిపారు. దేశజనాభాలో సుమారు 14 శాతం ప్రతి సంవత్సరం ఆర్దరైటిస్ వైద్యుని సంప్రదిస్తున్నట్లు పేర్కొన్నారు. సాధారణ గాయాల కారణంగా లేదా వృద్ధాప్యంలో ఆర్ధరైటిస్ కారణంగా కీళ్ళు దెబ్బ తిన్నప్పుడు, జాయింట్స్ రిప్లేస్‌మెంట్ ద్వారా ఎంతోప్రయోజనం పోందుతారని తెలిపారు.

కీళ్ళు దెబ్బతినకుండా నిరోదించేందుకు ఎనోన్నో ఆధునిక పద్దతులు ఉన్నట్లు తెలిపారు. ప్రారంభ దశలో కీళ్ళను సంరక్షిచడం వల్ల ఆర్దరైటిస్ నివారించవచ్చన్నారు. యశోద హస్సటల్స్‌గ్రూప్ మేనేజింగ్ డైరక్టర్ జిఎస్‌రావు మాట్లాడుతూ అత్యాధునిక రోబోటెక్,లాపరోస్కోపిక్, ఓపెన్ టెక్నిక్స్ ద్వారా అనేక ఆర్దోపెడిక్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. రెండు రోజులు పాటు నిర్వహించిన ఈ సదస్సుల్లో 500మందికి పైగా యువ సర్జన్లకు లైవ్ సర్జికల్ వర్క్‌షాప్ ద్వారా పలు ఆధునిక పద్దతులను వివరించినట్లు ఆయన తెలిపారు. ఆర్దో వైద్య రంగంలో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 20 మంది ప్రముఖ అంతర్జాతీయ జాతీయ ఆర్దోపెడిక్ వైద్య నిపుణులు వారి అనుభవాలను పంచుకున్నారన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News