Friday, November 22, 2024

దేశ నాయకుడైతడు

- Advertisement -
- Advertisement -

కెటిఆర్ లాంటి దార్శనికుడు భారత దేశానికి చాలా అవసరం
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావుకు తగ్గ తనయుడు
వారి పరిపాలనలో తెలంగాణ అభివృద్ధిలో పరుగులు పెడుతుంది
ప్రపంచ ఆర్థిక నిపుణులు, ఇన్వెంటర్ ఎండి కన్వాల్ రేఖీ ఫేస్‌బుక్‌లో వెల్లడి

మన తెలంగాణ/ హైదరాబాద్: యావత్ భారతదేశం కోసం తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు కేంద్ర ప్రభుత్వంలో తన శక్తి, సామర్ధాలను ఉపయోగించి అభివృద్ది కోసం కృషి చేస్తాడని ప్రపంచ ఆర్ధిక నిపుణులు, ఇన్వెంటస్ క్యాపిటల్ కంపెనీ ఎండీ కన్వాల్ రేఖీ ప్రశంసించారు. ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన కథనంపై ఫేస్‌బుక్‌లో స్పందిస్తూ ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కుమారుడిగా తండ్రికి దగ్గ తనయుడుగా పేరు సంపాదిస్తూ ప్రపంచ దేశాల ఐటీ నిపుణులచే శభాష్ అనిపించుకున్నట్లు పేర్కొన్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో శాస్త్ర సాంకేతిక వ్యవస్థను విస్తృత పరిచి వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి బాటలు వేశారు. గత కొద్ది సంవత్సరాల నుంచి తాను కెటిఆర్‌ను అమెరికా,భారతదేశంలో పలుమార్లు కలిసి ఐటీ, పారిశ్రామిక రంగాలపై చర్చించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ది పథంలో నడిపించేందుకు నిరంతరం కృషి చేస్తూ రాష్ట్ర ప్రజలను ప్రశంసలు పొందుతున్నాడని, ఆయన ఇతర రాష్ట్రాల మంత్రులు, రాజకీయ నాయకులకు రోల్ మోడల్‌గా నిలిచారని కొనియాడారు. తెలంగాణ ఒక చిన్న రాష్ట్రమని అందులో హైదరాబాద్ ఉందని, భారతదేశ జనాభాల్లో 2. 5 శాతం మాత్రమే ఉందని కానీ దేశ జిడిపిలో 5 శాతం ఉత్పత్తి చేస్తుందన్నారు. యువ మంత్రి కెటిఆర్ ఏదో ఒక రోజు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి భారత దేశ ప్రజలకు సేవలందిస్తాడని, ప్రస్తుతం నాయకులతో పోలిస్తే చాలా విజనరీ ఉన్న నాయకుడని వెల్లడించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకరావడంతో అతనికి ఆతనే సాటి, తన తండ్రి పరిపాలనలో తెలంగాణ మరింత బలపడుతుందని, పేద ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి పక్క రాష్ట్రాలు వచ్చి పరిశీలించే స్థాయి తెలంగాణ పెంచారని వెల్లడించారు. కెటిఆర్ లాంటి నాయకులు దేశానికి చాలా అవసరమని, ఇతర రాష్ట్రాల్లో కూడా అలాంటి నాయకులు ఎదగాలని సూచించారు.

Kanwal Rekhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News