Monday, December 23, 2024

బాలికపై దాడి చేసిన చిరుత దొరికింది..

- Advertisement -
- Advertisement -

తిరుమలలో బాలికపై దాడి చేసిన చిరుత బోనులో చిక్కింది. అలిపిరి నడకమార్గంలో అటవీ అధికారులు చిరుతను పట్టుకున్నారు. మూడు రోజుల క్రితం తిరుమల కొండపై కాలినడక మార్గంలో లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద లక్షిత అనే బాలికపై చిరుత దాడి చేసి చంపిన విషయం తెలిసిందే.

రెండు రోజుల్లో ఐదు ప్రాంతాల్లో చిరుత సంచారించినట్లు సిసిటివి ఫుటేజి ఆధారంగా గుర్తించిన అధికారులు.. బాలికపై దాడి చేసిన ప్రాంతంలో బోను ఏర్పాటు చేశారు. దీంతో సోమవారం తెల్లవారుజామున చిరుత బోనులో చిక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News