Friday, December 20, 2024

వేములవాడలో కలకలం.. దొంగతనానికి వచ్చి మహిళపై దాడి..

- Advertisement -
- Advertisement -

రాజన్న సిరిసిల్ల: దొంగతనానికి వచ్చి మహిళపై దాడి చేసిన ఘటన వేములవాడలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. పిల్లి శ్రీలత అనే మహిళ వేములవాడలోని భగవంతరావు నగర్ లో నివాసముంటోంది. తన భర్త గల్ఫ్‌ వెళ్లడంతో శ్రీలత ఒంటరిగా ఉంటోంది.

దీన్ని గమనించిన ఓ వ్యక్తి, అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దొంగతనానికి యత్నించాడు. ఆమెపై దాడి చేసి మెడలో ఉన్న గొలుసును ఎత్తుకెళ్లిందుకు ప్రయత్నించగా..ఆమె ధైర్యంగా ప్రతిఘటించడంతో కంగుతున్న దొంగ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇంటి వద్ద ఉన్న సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News