Monday, December 23, 2024

జాబిల్లికి మరింత చేరువగా చంద్రయాన్3

- Advertisement -
- Advertisement -

వచ్చేవారమే ల్యాండింగ్

బెంగళూరు : జాబిల్లిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రయాన్3 వ్యోమనౌకను ప్రయోగించి సోమవారం నాటికి నెల రోజులు పూర్తయ్యాయి. చంద్రుని చుట్టూ పరిభ్రమిస్తున్న ఈ వ్యోమనౌక సోమవారం చంద్రునికి మరింత చేరువైంది. చంద్రయాన్ 3 కక్ష తగ్గింపు విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించినట్టు ఇస్రో ప్రకటించింది. బెంగళూరు లోని “ఇస్రో టెలీమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ ( ఐఎస్‌టిఆర్‌ఎసి) నుంచి ఈ ప్రక్రియ చేపట్టినట్టు వెల్లడించింది. చంద్రుని చుట్టూ పరిభ్రమించే విషయంలో చంద్రయాన్3 కి ఇది రెండో చివరి కక్ష.  సోమవారం నాటి విన్యాసంతో వ్యోమనౌక కక్షను 150 కి.మీ x 177 కిమీ లకు తగ్గించినట్టు ఇస్రో తెలియజేసింది. తదుపరి కక్ష తగ్గింపు విన్యాసాన్ని ఆగస్టు 16 న ఉదయం 8.30 కు చేపట్టనున్నట్టు పేర్కొంది.

Also Read: కెసిఆర్ రూ. లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారు: రేవంత్ రెడ్డి

దీంతో ఈ అంతరిక్ష నౌక …చంద్రుడిపై 100 కిమీ ఎత్తున ఉన్న కక్ష లోకి చేరనుంది. ఆ తర్వాత ప్రొపల్సన్ మాడ్యూల్ నుంచి ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోతుంది. అంతా సజావుగా సాగితే ఈనెల 23 సాయంత్రం ల్యాండర్ చంద్రుడిపై అడుగు పెట్టనుంది. చంద్రయాన్ 3 ని జులై 14న ఎల్‌వీఎం3 ఎం4 రాకెట్ ద్వారా విజయవంతంగా భూకక్షలో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. మరుసటి రోజు తొలిసారి దీని కక్షను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో దశల వారీగా అయిదుసార్లు కక్షను పెంచారు. అయిదో భూకక్ష పూర్తయిన తరువాత .. జాబిల్లి దిశగా ప్రయాణానికి గానూ ఆగస్టు 1న “ట్రాన్స్ లూనార్ కక్ష” లోకి ప్రవేశ పెట్టారు. అక్కడి నుంచి ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్ష లోకి చేర్చారు. క్రమంగా కక్షలను తగ్గిస్తూ చంద్రునికి చేరువ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News