- Advertisement -
నల్లగొండ: రిజ్రిస్టేషన్ చేయడానికి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి వృద్ధుడు మృతి చెందిన సంఘటన మునుగోడులో సోమవారం మద్యాహ్నం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని ఇప్పర్తి గ్రామానికి చెందిన మహేశ్వరం పెద్ద నరసింహ(80) తన పేరిట ఉన్న 32గుంటల భూమిని మనవడి పేరిట రిజిస్ట్రేషన్ చేయడానికి సోమవారం తహసీల్దార్ కా ర్యాలయాన్ని వచ్చినట్లు తెలిపారు.సంతకం చేయడానికి కార్యాలయం లోపలికి వచ్చి స్పృహతప్పి పడిపోయాడని తెలిపారు. చికిత్సకోసం మునుగోడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వారు తెలిపారు.
- Advertisement -