- Advertisement -
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ పేరిట సోషల్ మీడియాలో బూటకపు వ్యాఖ్య వెలువడింది. దీనిపై సుప్రీంకోర్టు నిర్వాహక అధికార వర్గాలు తీవ్రంగా స్పందించి, నకిలీపోస్టింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాయి చాలా దురుద్ధేశపూరితంగా వాట్సాప్ గ్రూప్‌లో గుర్తుతెలియని వ్యక్తి అనుచిత స్పందనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపండని ఇందులో పేర్కొని ఉంది. పైగా దీనికి జతగా సిజెఐ ఫోటో కూడా పెట్టారు.
ఇటువంటి వ్యాఖ్యలకు ప్రధాన న్యాయమూర్తి దిగలేదు, ఈ విధంగా స్పందించాలని ఎవరినీ సూచించలేదని సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. ఇది మామూలు విషయం కాదని, దీనిని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, దీనిపై ఢిల్లీ పోలీసు సైబర్ విభాగానికి దర్యాప్తు చేసినట్లు సుప్రీంకోర్టు సెక్రెటరీ జనరల్ అతుల్ కుహార్కార్ తెలిపారు.
- Advertisement -