Monday, December 23, 2024

దుల్కర్ చిత్రాలని చూస్తుంటే గర్వంగా ఉంది : నాని

- Advertisement -
- Advertisement -

దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మాస్ ఎంటర్‌టైనర్ ‘కింగ్ ఆఫ్ కోత’. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటిస్తున్నారు. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రానికి అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. హ్యాండ్సమ్ హల్క్ రానా దగ్గుబాటి, నేచురల్ స్టార్ నాని ఈ వేడుకలో ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ వేడుకలో రానా దగ్గుబాటి మాట్లాడుతూ “కింగ్ ఆఫ్ కోత ట్రైలర్ చూసినప్పుడు సినిమాపై చాలా ఆసక్తి కలిగింది.

దుల్కర్ ఒక యాక్షన్ సినిమా చేయడం ఈ ఆసక్తికి కారణం. ఈ చిత్రం ఘన విజయం సాధించాలి”అని అన్నారు. నాని మాట్లాడుతూ “దుల్కర్ చేస్తున్న చిత్రాలని చూస్తుంటే చాలా గర్వంగా వుంది. పాన్ ఇండియా అనే మాట నాకు పెద్దగా నచ్చదు కానీ నాకు తెలిసిన యాక్టర్స్‌లో పాన్ ఇండియా యాక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే అది దుల్కర్ మాత్రమే. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం దర్శకులు దుల్కర్ కోసం కథ రాసుకుంటారు. సీతారామం సినిమాతో దుల్కర్ మనందరి మనసులు గెలుచుకున్నాడు. ఈ సినిమాతో అది నెక్స్ లెవెల్ కి వెళ్లాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు.

దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ “అభిలాష్ జోషికి ఇది మొదటి సినిమా అయినప్పటికీ ఎంతో అనుభవం కలిగిన దర్శకుడిలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు.జేక్స్ బిజోయ్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం కోసం నాలుగు భాషల్లో డబ్బింగ్ చెప్పాను. తెలుగులో నా వాయిస్ వుంటుంది. ఇది నా బిగ్గెస్ట్ ఫిల్మ్‌”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐశ్వర్య లక్ష్మీతో పాటు చిత్ర బృందం పాల్గొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News