Monday, December 23, 2024

భుజాలపై కూతురు.. పాయింట్ బ్లాంక్‌లో కాల్పులు

- Advertisement -
- Advertisement -

లక్నో: ఓ వ్యక్తి తన కూతురును భుజాలపై కూర్చుపెట్టుకొని తీసుకెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు అతడి దగ్గరికి వచ్చి పాయింట్ బ్లాక్‌లో కాల్చాడంతో అక్కడే కుప్పకూలిపోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం షాజాహన్‌పూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. షోయబ్ (28) అనే వ్యక్తి భుజాలపై కూర్చొపెట్టుకొని తీసుకొని వెళ్తుండగా బైక్‌పై ఇద్దరు దుండగులు అతడి క్రాస్ చేసి ముందుకు వెళ్లారు.ఒక దుండగుడు అతడి దగ్గరికి వచ్చి పాయింట్ బ్లాక్‌లో కాల్చడంతో అతడు కుప్పకూలిపోయాడు.

వెంటనే ముగ్గురు దుండగులు బైక్‌పై పారిపోయాడు. అక్కడ ఉన్న సిసి కెమెరాలో వీడియో నిక్షిప్తమైంది. స్థానికులు వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వెంటనే అక్కడి నుంచి బరేలీలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్‌పి అశోక్ మీనా అక్కడికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఆగస్టు 13 సాయంత్రం 7.30 నిమిషాలకు జరిగిందని తెలిపారు. నిందితులను అతి త్వరలో పట్టుకుంటామని వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News