Monday, January 20, 2025

అభివృద్ధికి నమూనా తెలంగాణ : బిసి కమిషన్ చైర్మన్ వకుళాభరణం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి నమూనాగా నిలిచిందని తెలంగాణ బిసి కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ కార్యాలయంలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహనరావు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం సభ్యులు సిహెచ్ ఉపేంద్ర, కె కిషోర్ గౌడ్ లతో కలిసి జెండావందనం, జాతీయ గీతం ఆలపించారు.

అంతకుముందు అక్కడ ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూల మాలలు సమర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ వకుళాభరణం ప్రసంగిస్తూ. దేశంలో తెలంగాణ అభివృద్ధికి నమూనాగా నిలవడం ఆనందంగా ఉందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సమంగా ఫలాలు లభించడమే నిజమైన స్వాతంత్య్రానికి స్ఫూర్తి. అని పదేళ్లలోపే రాష్టం అన్ని రంగాలలో గొప్ప ప్రగతిని సాధించడం ముఖ్యమంత్రి కెసిఆర్ దార్శనికతకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు కె.ప్రసాద్ రావు, జి.సతీష్ కుమార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News