Monday, November 25, 2024

జలమండలిలో ఘనంగా 77వ స్వాతంత్య్ర దినోత్స వేడుకలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: జలమండలిలో 77వ స్వాతంత్య్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఖైర తాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన వేడుకలకు ఆయన జలమండలి ఎండి దానకిషోర్ ముఖ్య అతిథిగా విచ్చేసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వినియోగదారులు, ఉద్యోగులు, కార్మికులకు స్వాతంత్య్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జలమండలి కార్మికులకు జీవో నెం.14 ను అమలు చేయడం ద్వారా వారికి వేలనాన్ని రూ. 9 వేల నుంచి రూ.15 వేలకు పెంచామన్నారు. దీని వల్ల బోర్డులో పనిచేసి ప్రతి కార్మికులు, సిబ్బంది కనీస వేతనం రూ.15 వేలు ఉందని తెలిపారు. ప్రస్తుతం జలమండలిలో నీటి సరఫరా, ఐటీ, ఎస్టీపీలు, ఇతర అన్ని విభాగాల్లో ఆధునిక సాంకేతికతను అమలు చేస్తున్నామన్నారు. వినియోగదారులకు మరిన్ని ఉత్తమమైన సేవలందించేందుకు ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి సంస్థలతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వివరించారు. ఇవే కాకుండా దేశంలోని అత్యుత్తమ సంస్థలతో కలిసి పనిచేస్తున్న ఏకైక సంస్థ జలమండలి అని కొనియాడారు.

భవిష్యత్తు తాగునీటి అవసరాల కోసం అదనంగా మరో 10 టీఎంసీల నీటిని సరఫరా చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు. మంత్రి కేటీఆర్ సూచనల మేరకు మురుగు నీటి నుంచి హైడ్రోజన్ ఇంధనాన్ని తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో 24 గంటలూ తాగునీరు అందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబందు పథకంలో భాగంగా పలువురు కార్మికులకు 160 వాహనాలను సైతం త్వరలో అందించనున్నట్లు తెలిపారు. కోటికి పైగా జనాభా నివసించే హైదరాబాద్ లాంటి మహానగరంలో తాగునీరు ఇవ్వటాన్ని ఉద్యోగంలో కాకుండా.. ఒక గురుతర బాధ్యతగా నిర్వహించాలని సూచించారు.జలమండలి కార్మికులకు జీవో నెం. 14 అమలు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఎండీ దానకిశోర్ ను రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ పి. నారాయణ శాలువాతో సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

జలమండలి చరిత్రలో క్షేత్ర స్థాయిలో పనిచేసే కార్మికులకు మొదటి సారిగా రెయిన్ కోట్ లు అందించడంపైనా హర్షం వ్యక్తం చేశారు.అలాగే ఇటీవల మలేసియాలో జరిగిన తైక్వాండో పోటీల్లో 3 పతకాలు సాధించిన జలమండలి 10 బి జీఎం వినోద్ ను ఎండీ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ వేడుకల్లో ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, టెక్నిక ల్ డైరెక్టర్ రవి కుమార్ ఆపరేషన్స్ 2 డైరెక్టర్ స్వామి, వాటర్ వరక్స్ ఎంప్లాయిస్ యూనియ అధ్యక్షుడు రాంబాబు యాదవ్ అసోసియేట్ ప్రసిడెంట్ రాజిరెడ్డి, సీజీఎంలు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News