Monday, December 23, 2024

సర్పంచుల నుంచి సెంట్రల్ విస్టా కార్మికుల దాకా..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎర్రకోట వద్ద జరిగిన 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తిలకించడానికి దేశంలోని వివిధ రంగాలకు చెందిన 1800 మంది ‘ ప్రత్యేక అతిథుల’కు ఆహ్వానాలు అందాయి.‘ జనభాగస్వామ్యం’ పేరిట వారికి ఆహ్వానాలు పంపారు. ఉజ్వల గ్రామాలనుంచి 400 మంది సర్పంచులు సహా 650 మందిని ఆహ్వానించారు. రైతు ఉత్పత్తిదారు సంస్థలనుంచి 250 మంది, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకంకింద చెరి 50 మంది చొప్పున, కొత్త పార్లమెంటు భవనం, సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొన్న 50 మంది, సరిహద్దు రోడ్ల నిర్మాణం, అమృత్ సరోవరాల తవ్వకం,ఇంటింటికీ నీరు పథకంలో పాల్గొన్న కార్మికులు,50 మంది ఖాదీకార్మికులు,ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, నర్సులు,

మత్స కారులనుంచి 50 మంది చొప్పున ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. ఢిల్లీలోని సుబ్రతో పార్క్ ప్రాంతంలో ఉన్న ఎయిర్‌ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్‌స్టిట్యూట్‌లో మ్యాథ్స్ లెక్చరర్‌గా పని చేస్తున్న రాహుల్ సోఫత్ కూడా ఈ ప్రత్యేక అతిథుల్లో ఉన్నారు. తమకు ఈ అవకాశం కల్పించిన సిబిఎస్‌ఇ, కేంద్ర విద్యాశాఖ, ప్రధానమంత్రి కార్యాలయానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ,ఇంత దగ్గరగా ప్రధానిని చూడగలగడం తమ అదృష్టమని పేర్కొన్నారు. తమ జ్ఞాపకాలను ఇది మరింత సుసంపన్నం చేస్తుందని కార్యక్రమం అనంతరం పిటిఐతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. ఆయన సతీమణి నిషి కూడా ఆయన వెంట వచ్చారు .సిబిఎస్‌ఇనుంచి 25 మంది టీచర్లం వచ్చామని సోఫట్ చెప్పారు. అనంతరం వారంతా తమ భాగస్వాములతో గ్రూపు ఫోటో కూడా దిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News