Monday, November 25, 2024

77వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ స్ఫూర్తితో వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కొట్రిక విజయలక్ష్మిఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కె.విజయలక్ష్మి మాట్లాడుతూ ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏడు మొక్కలు నాటి విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై స్ఫూర్తిని కలిగిస్తూ భవిష్యత్తులో ప్రతి ఒక్కరు గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించాలన్నారు.

బర్త్‌డేల సందర్భంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించి పర్యావరణ ప్రేమికులుగా మొక్క వలె ఎదగాలని విద్యార్థులకు స్ఫూర్తిని కలిగించారు. భవిష్యతు ్తలో ఎంపి సంతోష్ గ్రీన్ చాలెంజ్‌కు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు ఉంటాయని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నీరజ బాల్ రెడ్డి సోషల్ వర్కర్ కెవిఎం వెంకట్ పాఠశాల నిర్వహణ కమిటీ మల్లేశం, అనంత్ రెడ్డి ప్రధానాచార్యులు, విజయలక్ష్మి, కోటం సిద్ధ లింగం, బసవరాజు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News