Thursday, December 19, 2024

టెస్టులకు హసరంగా గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

కొలంబో: శ్రీలంక యువ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించాడు. ఈ విషయాన్ని హసరంగా మంగళవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. వన్డేలు, టి20లలో మరింత మెరుగైన ప్రదర్శన చేయాలనే ఉద్దేశంతో టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్టు వెల్లడించాడు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో హసరంగా ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు.

వన్డేల్లో, టి20లలో ఆల్‌రౌండ్‌షోతో అదరగొడుతున్నాడు. అయితే టెస్టుల్లో మాత్రం హసరంగా పెద్దగా ప్రభావం చూపలేక పోయాడు. కేవలం నాలుగు టెస్టుల్లో మాత్రమే లంకకు ప్రాతినిథ్యం వహించాడు. ఇందులో కూడా పెద్దగా రాణించలేదు. ఇలాంటి స్థితిలో టెస్టుల నుంచి తప్పుకోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చాడు. తాజాగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News