Monday, December 23, 2024

బ్యాంకులకు ధీటుగా రైతులకు రుణాలు

- Advertisement -
- Advertisement -
  • రైతులకు అండగా సహకార సంఘాలు
  • డిసిసిబి డైరెక్టర్, పిఎసిఎస్ చైర్మన్ వెంకటేష్ గుప్తా

ఆమనగల్లు: సహకార సంఘాల బలోపేతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని, బ్యాంకులకు ధీటుగా సహకార సంఘాలు, రైతు రుణాలు అందజేస్తున్నాయని మంత్రి నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర అప్కాబ్ చైర్మన్ రవీందర్‌రావులు అన్నారు. బుధవారం రాష్ట్రంలోని డీసీసీబీ ఉత్తమ డైరెక్టర్లతో మంత్రి నిరంజన్‌రెడ్డి, అప్కాబ్ చైర్మన్ రవీందర్‌రావులు సహకార సంఘం బలోపేతంపై ముఖ్య సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమనగల్లు సింగల్ విండో ఆధ్వర్యంలో 4 సంవత్సరాల కాలంలో రైతులకు ఇచ్చిన రూ. 4.52 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయని డీసీసీబీ డైరెక్టర్, పిఎసిఎస్ చైర్మన్ వెంకటేష్ గుప్తా తెలిపారు. అనంతరం సహకార సంఘాల బలోపేతానికి పలు సూచనలు చేశారు. చిరువ్యాపారులకు తక్కువ వడ్డీకి రుణాలను, ప్రత్యేక వ్యాపారాలకు రుణాలను అందిస్తామని, రైతులు సహకార సంఘాల రుణాలను వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. వన్ టైం సెటిల్‌మెంట్‌ను డిసెంబరు 31 వరకు పోడగించినట్లు రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చునని ఈ సందర్భంగా మంత్రి తెలిపినట్లు డైరెక్టర్ వెంకటేష్ గుప్తా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News