Monday, December 23, 2024

బోర్డు తిప్పేసిన సిటిఎస్ ట్రావెల్ ఏజెన్సీ

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః విదేశాలకు వెళ్లే విద్యార్థులకు విమానం టిక్కెట్లు బుక్ చేస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసిన ట్రావెల్ ఏజెన్సీ బోర్డు తిప్పేసింది. దీంతో విద్యార్థులు తామ మోసపోయామని పోలీస్ స్టేషన్‌కు పరిగెత్తారు. పోలీసుల కథనం ప్రకారం… అబిడ్స్‌లోని ఖాన్‌లతీఫ్‌ఖాన్ బిల్డింగ్‌లో సిటిఎస్ కార్పొరేట్ సొల్యూషన్ పేరుతో ట్రావెల్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. కొందరు ఏజెట్లను ఏర్పాటు చేసుకుని అమెరికా, యూకే, కెనడా దేశాలకు ఎంఎస్ చేయడానికి వెళ్లే విద్యార్థులకు ఫ్లైట్ టిక్కెట్లను బుక్ చేస్తామని ఆఫర్ చేశారు.

30మంది విదేశాలకు వెళ్లే విద్యార్థులు వీరి మాటలు నమ్మి లక్షలాది రూపాయలు ఇచ్చారు. విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఏజెంట్ కుతుబుద్దిన్ పరారయ్యడు. దీంతో ట్రావెల్ ఏజెన్సీ కూడా బోర్డు తిప్పేసింది. టిక్కెట్ల కోసం కార్యాలయానికి వచ్చిన విద్యార్థులు మూసి ఉండడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. తాము మోసపోయామని గ్రహించి వెంటనే అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిటిఎస్ కార్పొరేట్ ట్రావెల్ ఏజెన్సీపై గతంలో కూడా ఛీటింగ్ కేసులు ఉన్నాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అబిడ్స్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News