- Advertisement -
హైదరాబాద్ : నిరుద్యోగ దివ్యాంగుల కోసం ఈ నెల 17న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్టు రాష్ట్ర దివ్యాంగుల సాధికారత శాఖ కమిషన్ శైలజ ఒక ప్రకటనలో తెలిపారు. ట్రైన్స్ సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ ఉద్యోగ మేళాను హైదరాబాద్ గోషామహల్ ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఆసక్తి గల దివ్యాంగులు విద్యా ర్హత ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. వివరాలకు ఫోన్ 95817 10339 ను సంప్ర దించాలని సూచించారు.
- Advertisement -