నల్గొండ:అధికారులంతా సమన్వయంతో కలసికట్టుగా పనిచేస్తేనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని జెడ్పి చైర్మన్ బండ న రేందర్ రెడ్డి అన్నారు. ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకొని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తూ జిల్లాను సమగ్ర అభివృద్ధికి కృషి చే యాలని సూచించారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 1, 2,3,4,5,6,7 స్థాయి సంఘ సమావేశాలు జరిగాయి. ఒకటవ స్థాయి సంఘ సమావేశంలో సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు అంతా అందుబాటులో ఉంటున్నారని ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తున్నారన్నారు.
జటిలమైన సమస్యలపై చర్చించేందుకు స్థాయి సంఘ సమావేశాలు వినియోగించుకోవాలన్నారు. ఎన్నికలలోపు డబల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేసి ప్రజలకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు లేని పాఠశాల లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పై పంపిస్తున్నారు కానీ ఉపాధ్యాయులు కొంతమంది వెళ్లడం లేదన్నారు అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిఈఓను ఆదేశించారు.
రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెప్తున్నాను కానీ గ్రామస్థాయిలో పెన్సిల పేరుతో విద్యుత్ సమస్య ఏర్పడుతు ందని ప్రతి ఒక్కరూ ఫోన్ చేసినప్పుడు కాకుండా నిర్ణీత సమయంలో ఎల్సీ ఇచ్చి సమస్యలను ను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలని ఆదేశించారు. మూడవ స్థాయి సంఘ సమావేశం జడ్పీ వైస్ చైర్మన్ ఇరుగు పెద్దులు అధ్యక్షతన జరిగింది. ఐదవ స్థాయి సంఘం సమావేశం కంకణాల ప్రవీణ అధ్యక్షతన జరగగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడి టీచర్లు, సూపర్వైజర్లందరూ మంచి సేవలు అందిస్తున్నారని శిశు క్రియలు జరగకుండా బాల్యవివాహాలు జరగకుండా ముందే గుర్తించి ఆపాలన్నారు.
ప్రజా ప్రతినిధుల సహకారంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు అందే విధంగా ప్రతి ఒక్కరు చూ డాలని కోరారు. టిఆర్‌ఎస్ జడ్పీ ఫ్లోర్ లీడర్ తిప్పర్తి జడ్పిటిసి పాశం రామ్ రెడ్డి మాట్లాడుతూ రైతులు వర్షానికి కొంత బోర్ వాటర్ కు కొంత నాట్లు వేయడం జరుగుతుందని కరెంటు సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. కరెంటు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియడంలేదని టైం ప్రకారం ప గలు సమయంలో కరెంటు ఇచ్చే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, డిప్యూటీ సీఈవో కాంతమ్మ వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.