Saturday, December 21, 2024

సీనియర్ జర్మలిస్టు కృష్ణారావు కన్నుమూత..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః సినియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు కృష్ణారావు (64) హైదరాబాద్ లో కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్ తో బాధపడుతున్న కృష్ణారావు గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు.రాజకీయ నాయకులంతా బాబాయ్ గా పిలుచుకునే కృష్ణారావు జర్నలిజం ప్రస్తానం ఈనాడుతో మొదలై… ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్, ద న్యూ ఇండియన్‌ఎక్సెప్రెస్ లో సాగింది. సుధీర్ఘకాలం జర్నలిస్ట్ గా పని చేసిన కృష్ణారావు….. పలు సంచలనాత్మక వార్తలు రాశారు. సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సిహెచ్ ఎం వీ కృష్ణారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా చేసిన సేవలను సిఎం స్మరించుకున్నారు. పలు రంగాల్లో లోతైన అవగాహనతో ప్రజా ప్రయోజనాల కోణంలో వారు చేసిన రచనలు, విశ్లేషణలు, కొనసాగించిన టీవీ చర్చలు ఆలోచన రేకెత్తించేవిగా వుండేవని సిఎం తెలిపారు.

నాలుగు దశాబ్దాలకు పైబడి జర్నలిజం రంగానికి నిజాయితీగా సేవలందించిన సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటని సిఎం అన్నారు. ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతిని సిఎం కేసీఆర్ తెలిపారు. వివిధ హోదాలలో నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘంగా జర్నలిజం రంగానికి అనేక సేవలు అందించిన కృష్ణారావు గారి మరణం జర్నలిజానికి తీరని లోటని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.సన్నిహితులు ప్రేమగా ’బాబాయ్’ అని పిలుచుకునే ప్రముఖ జర్నలిస్ట్, సీనియర్ సంపాదకులు కృష్ణారావు మృతి బాధాకరమని మంత్రి హరీశ్ రావు అన్నారు..కృష్ణారావు మరణవార్త తనను ఎంతోగానో కలిచివేసిందన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.కృష్ణారావు మృతి పట్ల బిజెపి నాయకులు కిషన్‌రెడ్డి,బండి సంజయ్, ఈటెల రాజేందర్, డికె అరుణ,కాంగ్రేస్ నాయకులు రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క,మధుయాష్కీ, సినీ నటుడు బాలకృష్ణ, టి టిడిపి నాయకులు కాసాని జ్ఞానేశ్వర్,రావుల చంద్రశేఖర్ తమ సంతాపాన్ని తెలిపారు.

హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం ః
సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సిహెచ్ ఎం వీ కృష్ణారావు గారి మరణం పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన తీవ్ర సంతాపాన్ని తెలియజేసారు. నాలుగు దశాబ్దాలుగా జర్నలిజం రంగానికి సేవలతో, జర్నలిజం రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారని, వారి మృతి పత్రికా రంగానికి తీరనిలోటని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.
అన్ని అంశాల్లో సమగ్ర అవగాహన ఉన్న వ్యక్తి ః మన తెలంగాణ ఎడిటర్ పొలిశెట్టి అంజయ్య
సీనియర్ పాత్రికేయుడు సిహెచ్‌ఎంవి. కృష్ణారావు అన్ని అంశాల్లో సమగ్ర అవగాహన వున్న వ్యక్తి అని మన తెలంగాణ ఎడిటర్ పొలిశెట్టి అంజయ్య అన్నారు. సమకాలీన రాజకీయాలపై నిక్కచ్చిగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసే అతి కొద్ది మందిలో కృష్ణారావు ఒకరన్న ఆయన కృష్ణారావు పత్రికా రంగానికి చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ప్రస్తుత కష్టకాలంలో కుటుంబ సభ్యులకు భగవంతుడు అన్ని విధాలుగా అండగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News