Saturday, December 28, 2024

‘ఖుషి’ నుంచి ఎమోషనల్ లవ్ సాంగ్ ‘యెదకి ఒక గాయం’

- Advertisement -
- Advertisement -

విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఖుషి’ .  ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. మనసుకు హత్తుకునే ప్రేమ కథతో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు శివ నిర్వాణ రూపొందించారు. ‘ఖుషి’ సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి లవ్ పెయిన్ తెలిపే ‘యెదకి ఒక గాయం..’  లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

యెదకి ఒక గాయం..వదలమంది ప్రాణం ..చెలిమివిడి బంధం..ఎవరు ఇక సొంతం..కలతపడి హృదయం… కరగమంది మౌనం…గతమువిడి పాశం..ఏది ఇక బంధం అంటూ లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట. ఈ పాటకు దర్శకుడు శివ నిర్వాణ సాహిత్యాన్ని అందించగా సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహాబ్ స్వరపర్చి పాడారు. పాటలోని సాహిత్యం, సంగీతం ఎంతో అందంగా కలిసిపోయిన ఈ పాట వినగానే మ్యూజిక్ లవర్స్ ను ఫేవరేట్ సాంగ్ గా మారిపోవడం ఖాయం. ఈ పాటలో విజయ్ దేవరకొండ పలికించిన భావోద్వేగాలు కూడా ఆడియెన్స్ కు హార్ట్ టచింగ్ గా ఉండబోతున్నాయి. సినిమాలో ఈ పాట వచ్చే సిచ్యువేషన్ కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. యెదకి ఒక గాయం పాటకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి పిక్చరైజ్ చేసినట్లు దర్శకుడు శివ నిర్వాణ చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News