Monday, December 23, 2024

ఘనంగా సర్దార్ పాపన్న గౌడ్ 373వ జయంతి వేడుకలు

- Advertisement -
- Advertisement -

ఏర్గట్ల: ఏర్గట్ల మండలం తొర్తి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహ కూడలిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం మోకు దెబ్బ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోకు దెబ్బ మండలాధ్యక్షుడు తుపాకుల నారాగౌడ్ మోట్లాడుతూ మొగులాయిల దౌర్జన్యాలను ఎదిరించిన వీరుడు సర్దార్ పాపన్న గౌడ్ అని అన్నారు.

కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు తుపాకుల నారా గౌడ్, బోల్లెపల్లి సుమన్ గౌడ్, బోల్లెపల్లి గోవర్ధన్ గౌడ్, తుపాకుల రవి గౌడ్, రాజాగౌడ్, శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం సభ్యులు, సర్పంచ్ నవీన్, ఉప సర్పంచ్ తహెర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News