Monday, December 23, 2024

నేను ప్రజల మనిషిని..నాకు సెక్యూరిటీతో పనిలేదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తాను ప్రజల మనిషిని, తనకు సెక్యూరిటీతో పనిలేదని, తాను సెక్యూరిటీ లేకుండా ఎక్కడికైనా వస్తానని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ తగ్గింపు విషయంపై మీడియాతో రేవంత్‌రెడ్డి చిట్‌చాట్‌గా మాట్లాడారు. కోర్టు చెప్పినా ప్రభుత్వం తనకు సెక్యూరిటీ ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. ఎంపిగా, జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న తనకు సెక్యూరిటీ తొలగిస్తారా? అని ఆయన నిలదీశారు. సెక్యూరిటీ విషయంలో తనను భయపెట్టాలని చూస్తే భయపడేవాడిని కాదన్నారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు తన సైన్యమని, తన సెక్యూరిటీ వాళ్లే అని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలోని అన్ని డిపార్ట్‌మెంట్‌ల్లో కొందరు అధికారులు ప్రభుత్వ తాబేదార్లుగా ఉంటారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేసే అధికారుల పేర్లను తప్పకుండా రెడ్ బుక్‌లో రాస్తామని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం కోసం కాంగ్రెస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టే వాళ్లని వదిలిపెట్టాలని ఆయన మండిపడ్డారు. అధికారులకు రాజకీయాలతో ఏంటి సంబంధం అని ప్రశ్నించారు. కాగా, పొత్తుల గురించి ఎన్నికల సమయం వచ్చినప్పుడు ఏఐసిసి చూసుకుంటుందని రేవంత్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News