Tuesday, December 24, 2024

ఘనంగా సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

- Advertisement -
- Advertisement -

గద్వాల రూరల్: బహుజనుల ఆరాధ్యదైవం, గోల్కొండ రాజ్యాన్ని ఎదిరించి సొంతంగా రాజ్యాన్ని ఏర్పాటు చేసిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా ఆబ్కారీ శాఖ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నర్సింహ్మరెడ్డి, ఆబ్కారీ శాఖ సీఐ గోపాల్, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్‌గౌడ్, ఎక్సైజ్ శాఖ సబ్ ఇన్‌స్పెక్టర్‌లు, ఇన్స్‌పెక్టర్లు, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News