తుర్కయంజాల్: రైతులకు సహకార సంఘాలు ఎంతో దోహదపడతాయని రంగారెడ్డి జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్యక్షుడు, ఇబ్రహీంప ట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ తొర్రూర్‌లో ఎర్పాటు చేసిన తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం 3వ శాఖను ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి ఛైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి, వైస్ ఛైర్మన్ కొత్తకుర్మ సత్తయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు శ్రేయస్సుకు సహకార సంఘాలు నిరంతరం కృషి చేస్తున్నుట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో అనేకమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తు రైతులకు ఎల్లప్పుడు అండగా ఉంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి ఆధ్యక్షుడు వంగేటి లకా్ష్మరెడ్డి, వైస్ చైర్మన్ కొత్త రాంరెడ్డి, డైరక్టర్‌లు సామ సంజీవరెడ్డి, ,జక్క రాంరెడ్డి, చాపల యాదగిరి, సామ సత్యనారాయణరెడ్డి కోండ్రు స్వప్న శ్రీనివాస్, శీలం లక్ష్మమ్మ, బ్యాంకు మాజీ ఛై ర్మన్ సంరెడ్డి బాల్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కందాడ ముత్యంరెడ్డి, మాజీ డైరక్టర్ సంరెడ్డి భుజంగరెడ్డి, కందాళ బలదేవారెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు.