Saturday, December 21, 2024

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు ప్రోత్సాహాన్నందిస్తోంది

- Advertisement -
- Advertisement -
కెసిఆర్ సర్కార్‌పై డిజిపి అంజనీ కుమార్ ప్రశంసల జల్లు

మన తెలంగాణ/హైదరాబాద్ : కెసిఆర్ సర్కార్‌పై రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ ప్రశంసల జల్లు కురిపించారు. పోలీస్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. చాలా రాష్ట్రాల్లో చిన్న చిన్న పనులకు కూడా నిధులు లేక పోలీస్ శాఖ ఇబ్బంది పడుతోందని, రాష్ట్రంలో మాత్రం అలాంటి పరిస్థితి లేదన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం పోలీసులను ప్రోత్సహిస్తోందని, ఇక్కడ విధులు నిర్వహించడం మన అదృష్టమన్నారు. మెదక్ జిల్లాలో సిఎం కెసిఆర్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా ఎస్‌పి రోహిణితో మాట్లాడినట్లు తెలిపారు. మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని కూడా సీఎం ప్రారంభించనున్నారు. కాబట్టి అందుకోసం జరుగుతున్న ఏర్పాట్లు గురించి చర్చించానన్నారు.

అయితే ఈ కార్యాలయం కూడా అన్ని జిల్లాల్లో మాదిరిగానే ఏ 25 లేదా 30 ఎకరాల్లో వుంటుందని భావించానని, కానీ ప్రభుత్వం ఏకంగా 62 ఎకరాల కేటాయించినట్లు తెలిసి ఆశ్చర్యపోయానన్నారు. ఇది ఎవ్వరూ ఊహించి వుండరన్నారు. దేశంలో ఆ చివరనున్న కశ్మీర్ నుండి ఈ చివరనున్న కన్యా కుమారి వరకు వెతికినా ఎక్కడా ఓ జిల్లా పోలీస్ కార్యాలయం కోసం ఇంత భూమి కేటాయించడం జరిగి వుండదన్నారు. అలాగే 45 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైక్వాలిటితో అద్భుతమైన ఎస్‌పి కార్యాలయ భవనం నిర్మించారన్నారు. ఇది చాలు తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖను ఎంతలా ప్రోత్సహిస్తుందో చెప్పడానికి అని డిజిపి అజనీ కుమార్ పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News