- Advertisement -
హైదరాబాద్ : బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్.. ఈ నెల 21న అమరావతికి వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీకి సంబంధించిన ఓటర్ల నమోదు ప్రక్రియను ఆయన సమీక్షించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. తెలంగాణ. ఎపితో పాటు మహారాష్ట్ర, గోవా, ఒడిశా ఓటర్ల నమోదు ప్రక్రియను సమీక్షించే బాధ్యతను పార్టీ అధిష్టానం బండి సంజయ్‌కు అప్పగించింది. కాగా బండి సంజయ్ రాకతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం రసవత్తరంగా మారనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణతో పాటు ఎపిలోనూ బండి సంజయ్ సేవలను ఉపయోగించుకోవాలని అక్కడి పార్టీ నేతలు భావిస్తున్నారు.
- Advertisement -