Saturday, November 23, 2024

టి కాంగ్రెస్‌లో సీనియర్ల అసంతృప్తి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టి కాంగ్రెస్‌లో సీనియర్ల అసంతృప్తి కొనసాగుతుండగానే మరో చిక్కు వచ్చి పడింది. రాష్ట్ర పార్టీ వైఖరిపై మహిళా కాంగ్రెస్ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ సాక్షిగా మహిళా నేతలంతా పార్టీపై ఫైర్ అవ్వడంతో ఇప్పుడు సర్ధి చెప్పడం టిపిసిసికి సవాల్‌గా మారింది. పార్టీ ఏర్పాటు చేస్తున్న కమిటీ కూర్పులో తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. టిక్కెట్లలోనూ వివక్ష చూపేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆరోపించారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఢిల్లీలో ఏఐసిసి కార్యదర్శి కెసి వేణుగోపాల్‌కు ఫిర్యాదు చేశారు.

మహిళలకు తమ కోటా ప్రకారం టిక్కెట్లు ఇవ్వాల్సిందేనని ఆమె తెలిపారు. మహిళలకు సమాన హక్కులు కావాలన్నారు. 51 శాతం ఉన్న తమకు అన్యాయం చేయడం తగదన్నారు. ఢిల్లీలో జరిగిన మహిళా సెమినార్‌కు కూడా పార్టీ నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని ఆమె కెసి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 172 మంది మహిళా కార్యకర్తలంతా సొంత ఖర్చులతో నేషనల్ సెమినార్‌కు హాజరయ్యాయని ఆమె వాపోయారు. అసెంబ్లీ సీట్లతో తప్పకుండా ప్రాతినిథ్యం కల్పించాలన్నారు. 35 ఏళ్లుగా ఎంతోమంది పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారని, కానీ ఎలాంటి లాభం లేకుండా పోయిందని ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News