Friday, November 22, 2024

జిహెచ్‌ఎంసి కార్మికుల సమ్మె.. ఎక్కడికక్కడ అరెస్టులు

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో ః జిహెచ్‌ఎంసిలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. ఇందులో భాగంగా విధులను బహిష్కరించిన కార్మికులు జోనల్, సర్కిల్ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు ఎక్కడికి అక్కడ అరెస్టు చేయడంతో ఉద్రికత్త చోటు చేసుకుంది.

సమ్మెలో భాగంగా జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు వచ్చిన కార్మికులను పోలీసులు గేటు బయటే అదుపులో తీసుకున్నారు. మరోవైపు సెక్రటేరియట్ ముట్టడికి యత్నించిన జీహెచ్‌ఎంఈయూ అధ్యక్షులు గోపాల్ ని పోలీసులు అరెస్టు చేసి సైఫాబాద్ పోలీసు స్టేషన్ కి తరలించారు. వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేసిన కార్మికలను గోషామహాల్ పోలీసు స్టేషన్‌కు తరించిన పోలీసులు వారిని వదిలిపెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News