Thursday, December 19, 2024

నిలోఫర్ ఆసుపత్రిలో ఘనంగా శ్రావణ మాసం బోనాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : నిలోఫర్ ఆసుపత్రిలో శ్రావణ మాస బోనాల ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈవేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మన్నెబోయిన కృష్ణ యాదవ్ మాట్లాడుతూ పేద ప్రజలందరికి ఉపయోగపడే ఆసుపత్రి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన చిన్నపిల్లల దవాఖాన నిలోఫర్ హాస్పిటల్ అని కొనియాడారు. మెడికల్ సిబ్బంది అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పోరాడి తెలంగాణ తెచ్చుకున్నారని, దాని ఫలాలను ఇక్కడున్న ప్రజలందరికీ వైద్యులు అందిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో రవీందర్, పావని గౌడ్, శ్రావణ్ కుమార్, ఆంజనేయులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News