Monday, December 23, 2024

కృషి పట్టుదల ఉంటే సామాన్యుడు పాలకుడు కావచ్చు

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో ః కృషి పట్టుదల ఉంటె సామాన్యుడు సహితం పాలకుడు కావచ్చని నిరూపించిన మహానీయుడు సర్దార్ సర్వాయి పాపన్న అని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ కొనియాడారు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భావించిన తర్వాత తెలంగాణ మహనీయుల జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహించడం ద్వారా సముచితంగా గౌరవించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల పురస్కరించుకుని ఘనంగా నివాళ్లు అర్పించారు.

ఈ సందర్బంగా మధుసూదన్ మాట్లాడుతూ బహుజనులు పరిపాలించడమనేది గొప్ప విషయమని అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 1650 సంవత్సరం ఆగష్టు 18న ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం తాటికొండ లో గౌడ్ కులంటుంబంలో జన్మించారని తెలిపారు. కులవృత్తి చేసి కుటుంబానికి పరిమితం కాకుండా రాజ్యమేలి సమాజం కోసం పని చేశాడన్నారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి ఆశన్న, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News