Saturday, December 21, 2024

ఇంటింటి నుంచి ప్రతిరోజు చెత్తను సేకరించాలి : కమిషనర్ రోనాల్ రోస్

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో : ప్రతి రోజు స్వచ్చ ఆటోల ద్వారా ఇంటింటి నుంచి చెత్తను సమర్థవంతంగా సేకరించడం ద్వారా నగరంలో రోడ్లపై ఎక్కడ చెత్త పొగుబడకుండ చర్యలు తీసుకోవాలని జిహెచ్‌ఎం సికమిషనర్ రోనాల్ రోస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ మాదాపూర్, అయ్యప్ప నగర్ లో తొలగించిన చెత్తడంపింగ్ ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎత్తివేసిన జి విపి గురించి కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. గార్బెజ్ పాయింట్లను ఎత్తివేయడం వల్ల ఎలాంటి సమస్య లేదని ఇంటింటికి స్వచ్ఛ ఆటో వాళ్లలు రోజు వారీగా చెత్తను తీసుకు వెళ్లుతున్నారని కాలనీ వాసులు కమిషనర్ కు వివరించారు.

ఇదేక్రమంలో కమిషనర్ పర్వతపూర్ కాలనీ వెళ్లి జివిబి పరిశీలన చేస్తుండగా అదే సమయంలో కాలనీ వాసులు చెత్త పట్టుకొని రావడం చూసి కమిషనర్ ఎస్‌ఎఫ్‌ఏ పై మండి పడ్డారు. స్చచ్చ ఆటోల ద్వారా ఇంటికే వచ్చి చెత్తను సేకరిస్తుండగా ఎందుకు రోడ్లపై వేయాల్సి వస్తోందో కమిషనర్ కాలనీవాసులను ఆరా తీశారు. దీంతో స్వచ్ఛ ఆటో రోజు వారీగా రాక పోవడంతో జి వి బి వద్ద చెత్తను వేస్తున్నట్లు కమిషనర్ కు వారంతా వివరించారు. దీంతో ఎస్ ఎఫ్‌ఏ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న జోనల్ కమిషనర్, శానిటేషన్ అడిషనల్ కమిషనర్‌లను ఆదేశించారు. తదనంతరం జూబ్లీహిల్స్‌లో నిర్వహిస్తున్న గోశాలను సందర్శించి శానిటేషన్ కు సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డి సి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News