Saturday, November 23, 2024

1,20,100

- Advertisement -
- Advertisement -

ఇవి మద్యం షాపులకు వచ్చిన దరఖాస్తులు

అప్లికేషన్లతోనే సర్కార్‌కు రూ.2,402కోట్ల ఆదాయం
దరఖాస్తుల్లో రంగారెడ్డి జిల్లా టాప్.. తర్వాతి స్థానాల్లో నల్లగొండ, ఖమ్మం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తా యి. శుక్రవారంతో దరఖాస్తులకు గడువు ముగియనుండడంతో పెద్దఎత్తున ఆశావహు లు దరఖాస్తులు చేసుకునేందుకు ఎక్సైజ్ కా ర్యాలయాల వద్ద బారులు తీరారు. సాయం త్రం 7 గంటల వరకు వచ్చిన 1,20,100 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ద్వారా ప్రభుత్వానికి రూ.2,402 కోట్ల ఆదాయం రాగా గతంలో రూ.1357 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ దరఖాస్తుల్లో సింహభాగం రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్, సరూర్‌నగర్‌ల నుంచే రావడం గమనార్హం. సరూర్‌నగర్ సూపరింటెండెంట్ పరిధిలో 10 వేల దరఖాస్తులు రాగా, శంషాబాద్ సూపరింటెండెంట్ పరిధిలో 9,760 దరఖాస్తులు వచ్చాయి. ఈ రెండు ప్రాంతాలు దరఖాస్తుల స్వీకరణలో రికార్డు సృష్టించడం ఆనందంగా ఉందని సరూర్‌నగర్ సూపరింటెండెంట్ రవీందర్ రావు, శంషాబాద్ సూపరింటెండెంట్ సత్యనారాయణలు పేర్కొన్నారు. ఇక రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ పరిధిలోని రంగారెడ్డి, సరూర్‌నగర్, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలో 33,917 దరఖాస్తులు వచ్చాయని డేవిడ్ రవికాంత్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్యలు పేర్కొన్నారు. తమ పరిధిలో 202123 సంవత్సరానికి 15,542 దరఖాస్తులు వస్తే, ప్రస్తుతం 33వేల పైచిలుకు దరఖాస్తులు రావడంతో 218 శాతం అధిక దరఖాస్తులు వచ్చినట్టు అయ్యిందని వారు తెలిపారు. మాములుగా శుక్రవారం 6 గంటల వరకే దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియగా, ఉదయం నుంచి లైన్‌లో ఉన్న ఆశావహుల నుంచి కూడా దరఖాస్తులను ఎక్సైజ్ అధికారులు స్వీకరించడంతో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా జారీ చేయనున్న లైసెన్సులు డిసెంబర్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి.
756 మద్యం దుకాణాలు రిజర్వేషన్‌దారులకు
పాత విధానం ద్వారా ఈ సారి మద్యం దుకాణాల లైసెన్సులను ఎక్సైజ్ శాఖ జారీ చేయనుంది. ఇక మద్యం దుకాణాల్లో ప్రభుత్వం గౌడ కులస్తులకు 15శాతం రిజర్వేషన్లు కేటాయించగా ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు మరో ఐదుశాతం రిజర్వేషన్లను కల్పించింది. రాష్టవ్యాప్తంగా గీత కార్మికులకు 363, దళితులకు 262, గిరిజనులకు 131 కలిపి మొత్తం 756 మద్యం దుకాణాలు రిజర్వేషన్ల ప్రాతిపాదికన కేటాయించనుండగా మిగతా 1,864 మద్యం దుకాణాలు జనరల్ కేటగిరి కింద లైసెన్సులు జారీ చేయనున్నారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీల లాటరీ ద్వారా ఈనెల 21 వ తేదీన డ్రా పద్ధతిలో ఈ దుకాణాల లైసెన్సులను కేటాయించనున్నారు.
సరూర్‌నగర్‌లో 10,000 దరఖాస్తులు
శుక్రవారం (ఆగస్టు 18వ తేదీ) చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు ఒక లక్ష 7 వేల 16 దరఖాస్తులు రాగా 7 గంటల తరువాత 1,16,500 లక్షల పైచిలుకు దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు సరూర్‌నగర్‌లో 10,000 దరఖాస్తులు రాగా, శంషాబాద్‌లో 9,760, నల్గొండలో 6,134, ఖమ్మంలో 5,906, కొత్తగూడెంలో 3,906, మహబూబ్‌నగర్‌లో 2,948, కరీంనగర్‌లో 2,749, సికింద్రాబాద్‌లో 2,289, హైదరాబాద్‌లో 2,331, జగిత్యాలలో 1,857, మంచిర్యాలలో 1,627, పెద్దపల్లిలో 1,102, సిరిసిల్లలో 1,613, గద్వాల్‌లో 1,050, నాగర్‌కర్నూల్‌లో 1,968, మెదక్‌లో 1,525, సంగారెడ్డిలో 3,979, సూర్యాపేటలో 3,434, యాదాద్రిలో 3,129, కామారెడ్డిలో 1,720, నిజామాబాద్‌లో 2,503, వరంగల్ రూరల్ 2,001, వరంగల్ అర్భన్‌లో 4,590, మేడ్చల్‌లో 5,210 దరఖాస్తులు వచ్చాయి. తక్కువగా దరఖాస్తులు వచ్చిన ప్రాంతాల్లో నిర్మల్‌లో 657 దరఖాస్తులు, అదిలాబాద్‌లో 781, ఆసిఫాబాద్ 846, వనపర్తిలో 989, దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఎపికి చెందిన వ్యక్తులే భారీగా టెండర్లు
శుక్రవారం శ్రావణ శుక్రవారం కావడంతో మద్యం షాపులకు భారీగా టెండర్లు వేయడానికి ఔత్సాహికులు ఆసక్తి చూపారు. అయితే వికారాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి సిండికేట్ అయ్యి 999 దరఖాస్తులు వేసినట్లుగా ప్రచారం జరగడంతో దానిలో నిజమెంత అన్న విషయమై ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఆరా తీశారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఎపికి చెందిన వ్యక్తులే భారీగా టెండర్లు వేసినట్లుగా తెలిసింది. ఒక షాపునకు 20 దరఖాస్తులకంటే తక్కువగా వస్తే మళ్ళీ టెండర్లు పిలవాలని అధికారులు భావిస్తున్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News