Tuesday, January 21, 2025

‘బాయ్స్ హాస్టల్’ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసిన ‘బేబీ’ టీమ్

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యుషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి కన్నడ బ్లాక్ బస్టర్ హాస్టల్ హుడుగారు బేకగిద్దరేను తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో విడుదల చేస్తున్నారు. నితిన్ కృష్ణమూర్తి ఈ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసారు. ఇందులో ప్రజ్వల్ బిపి, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ఉర్స్ ప్రధాన పాత్రలు పోషించగా, రిషబ్ శెట్టి, పవన్ కుమార్, షైన్ శెట్టి, రష్మీ గౌతమ్,  తరుణ్ భాస్కర్ అతిధి పాత్రల్లో నటించారు. ‘బేబీ’ టీమ్ బాయ్స్ హాస్టల్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది.

బాయ్స్ హాస్టల్ ట్రైలర్‌ హాస్టల్‌లో ఉంటున్న అబ్బాయిల జీవితాలను ప్రజెంట్ చేసింది. వారు జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ, అల్లరిగా సరదాగా గడుపుతుంటారు. హాస్టల్ వార్డెన్ అనుమానాస్పద పరిస్థితులలో చనిపోయినప్పుడు వారికి పెద్ద సమస్య దురౌతుంది. హాస్టల్‌ కుర్రాళ్లు దీన్ని యాక్సిడెంట్‌గా మార్చే ప్రయత్నం చేయడంతో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారుతుంది.  ట్రైలర్ హిలేరియస్మక్రేజీ మూమెంట్స్‌తో నిండిపోయింది. నటీనటులందరూ కొత్తవారే అయినప్పటికీ తమ రియలిస్టిక్ యాక్టింగ్‌తో కథనంలో ఫ్రెష్‌నెస్ తీసుకొచ్చారు. తరుణ్ భాస్కర్ ప్రత్యేక పాత్రలో కనిపించగా, రిషబ్ శెట్టి, ఇతర ప్రముఖుల ప్రజన్స్ పెద్ద యాడ్-ఆన్. పాపులర్ యాంకర్ రష్మీ గౌతమ్ సూపర్ హాట్ గా కనిపించింది.

దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి కూడా ఒక నిర్మాతగా వరుణ్ గౌడ, ప్రజ్వల్ B. P. , అరవింద్ S. కశ్యప్‌లతో కలిసి గుల్‌మోహర్ ఫిల్మ్స్ , వరుణ్ స్టూడియోస్ బ్యానర్‌లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. పరంవా పిక్చర్స్ బ్యానర్‌పై రక్షిత్ శెట్టి సమర్పించారు. అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ అందించగా, బి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. సురేష్ ఎమ్ ఎడిటర్ . బాయ్స్ హాస్టల్ ఆగస్ట్ 26న విడుదల కానుంది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో శరత్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూసినప్పుడు ప్రారంభం నుంచి చివరి వరకూ నవ్వుతూనే వున్నాను. సినిమా పూర్తయ్యేసరికి ఒక ఎనర్జీ వచ్చింది. ఇదొక క్రేజీ జోనర్ ఫిల్మ్. ఎడిట్స్ చాలా క్రేజీగా అనిపించాయి. ఈ సినిమాని రీమేక్ చేయడం కుదరదు. డబ్బింగ్ చేస్తామని సుప్రియ గారితో మాట్లాడి టీంని కలిశాం. డబ్బింగ్ సినిమా అంటే కొన్ని వాయిసులు రొటీన్ గా వినిపిస్తాయి. ఈ సినిమా యాభై పాత్రలు వున్నాయి. వాటి కోసం కొత్తగా యాభై వాయిస్ లు తీసుకొచ్చాం. ప్రతి పాత్ర బాడీ లాంజ్వేజ్ కి సరిపడే వాయిస్ తో ప్రోపర్ గా డబ్బింగ్ చేశాం. కార్తిక్ రత్నం లీడ్ వాయిస్ ఇచ్చారు. డైరెక్టర్ టీం కూడా పదిరోజులుగా మాతోనే వున్నారు. ట్రైలర్ చూస్తే లిప్ కూడా చాలా చోట్ల సింక్ అయివుటుంది. సినిమా బ్రిలియంట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. కన్నడ చూసిన వాళ్ళు కూడా తెలుగులో చూస్తే కొత్త అనుభూతిని ఇస్తుంది. థియేటర్ లో చూసినప్పుడు క్రేజీగా వుంటుంది. ట్రైలర్ ని బేబీ లాంటి పెద్ద హిట్ కొట్టిన టీం అందరితో లాంచ్ చేయడం అనందంగా వుంది.’’ అన్నారు

అనురాగ్ రెడ్డి  మాట్లాడుతూ.. దాదాపు 500మంది థియేటర్ ఆర్టిస్ట్ లతో కలసి అంతా కొత్త కాస్టింగ్ తో ఈ సినిమాని క్రియేట్ చేశారు. ఇది మ్యాడ్ ఫిల్మ్. చాలా క్రేజీగా వుంటుంది. దిన్ని రిక్రియేట్ చేయడం అసాధ్యం. సినిమా అంతా లొల్లిగా వుంటుంది. ఆ లొల్లిలో మజాని 26న చూడబోతున్నారు. రష్మీ గౌతమ్, తరుణ్ భాస్కర్ స్పెషల్ రోల్స్ చేశారు. చాలా ఇంట్రస్టింగా వుంటుంది.  ఈ ఈవెంట్ కి వచ్చిన బేబీ టీం అందరికీ థాంక్స్. అన్నపూర్ణ స్టూడియోస్ సపోర్ట్ కి థాంక్స్.  కాంతారకి పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్, డీవోపీ ఈ చిత్రానికి పని చేశారు. ఫిల్మ్ మేకింగ్ ఎక్స్ టార్దినరిగా వుంటుంది. గొప్ప థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ సినిమా తెలుగులోకి తీసుకురావడం గౌరవంగా భావిస్తున్నాను. ప్రేక్షకదేవో భవ.. మీ అందరి సపోర్ట్ కి కృతజ్ఞతలు’’ తెలిపారు.

సుప్రియ మాట్లాడుతూ.. చాయ్ బిస్కెట్ అనురాగ్ ఈ సినిమా ట్రైలర్ చూపించారు. చాలా ఫన్, ఎనర్జిటిక్ గా వుంది. అప్పుడే ఈ సినిమాని తెలుగులో విడుదల చేయాలని  భావించాం. నితిన్ అండ్ టీం అద్భుతంగా తీశారు’’ అన్నారు.

రష్మీ గౌతమ్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ వారం రోజుల్లోనే కన్ ఫార్మ్ అయ్యింది. షూటింగ్ కూడా అంటే ఫాస్ట్ గా జరిగింది. కన్నడలో ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఇలాంటి సినిమా తెలుగులో వస్తే మరో విజయం వచ్చినట్లే. చాలా రోజుల తర్వాత గ్లామర్ రోల్ చేయడం అనందంగా వుంది. మంచి టీంతో కలసి పని చేశాం. ఈ సినిమాలో భాగం కావడం అనందంగా వుంది’’ అన్నారు.

నితిన్ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ గారి ఆశీస్సులతో ఈ సినిమా మొదలుపెట్టాం. కన్నడలో సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాను. అన్నపూర్ణ స్టూడియోస్ & చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కు థాంక్స్. అలాగే ఈ ఈవెంట్ కి విచ్చేసిన బేబీ యూనిట్ కి కూడా థాంక్స్.  కొత్త ప్రతిభని ఆదరించడంతో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుటారు. ఈ సినిమాని పెద్ద విజయం చేస్తారని కోరుకుంటున్నాను’’ అన్నారు.

కార్తిక్ రత్నం మాట్లాడుతూ.. ఈ సినిమా చుస్తునప్పుడు చాలా క్రేజీగా అనిపించింది. మొదటి ఇరవై నిముషాలు క్రేజీ గా వుంటే తర్వాత సినిమా నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. చాలా నచ్చింది. ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పినందుకు చాలా హ్యాపీగా వుంది. సినిమా ఎక్స్ టార్దినరిగా వుంటుంది. అందరూ ఫ్యామిలీతో కలసి చూడండి’’అన్నారు.

ప్రజ్వల్ మాట్లాడుతూ.. అన్నపూర్ణ స్టూడియోస్ & చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కి థాంక్స్. తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. కన్నడలో ఈన చిత్రం పెద్ద విజయం సాధించింది. అదే ప్రేమని ఇక్కడ కూడా చూపిస్తారని కోరుకుంటున్నాను.

ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. చదువుకునే రోజుల్లో బాయ్స్ హాస్టల్ ఎలా వుంటుందో ఒక ఐడియా వుంది. నితిన్ అద్భుతంగా ఈ సినిమా తీశారు. నిజంగా ఇలాంటి ఫాస్ట్ కట్స్ తో క్రేజీ సినిమా చేయడం అంత ఈజీగా కాదు.  చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ శరత్, అనురాగ్ మేజర్, రైటర్ పద్మభూషణ్, మేము ఫేమస్ లాంటి కంటెంట్ బేస్డ్ చిత్రాలు చేశారు. హాస్టల్ బాయ్స్ ని కూడా మంచి టెక్నికల్ వాల్యూస్ తో డబ్ చేశారు. ఆగస్ట్ 26న సినిమాని థియేటర్ లో చూసి ఎంజాయ్ చేద్దాం’’ అన్నారు.

వైష్ణవి చైతన్య మాట్లాడుతూ..టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ వేడుకకు రావడం అనందంగా వుంది. ఇలాంటి సినిమాలు  కోసం ఎదురుచూస్తుంటాం.  ఆగస్ట్ 26న సినిమాని ఎంజాయ్ చేద్దాం’’ అన్నారు

విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ.. నితిన్ ఈ సినిమా అద్భుతంగా తీశారు. ఈ సినిమా ట్రైలర్ తెలుగులో చూస్తుంటే మజా వచ్చింది. ఈ సినిమా ఒక పండగలా వుంటుంది.  అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ నుంచి సినిమా వస్తుందంటే వండర్ ఫుల్ గా వుంటుంది . ఆగస్ట్ 26న థియేటర్స్ లో కలుద్దాం’’ అన్నారు

ఎస్కేఎన్ మాట్లాడుతూ.. బేబీ విడుదలైన సమయంలోనే ఈ సినిమా కన్నడలో ఘన విజయం సాధించింది. అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ ఇప్పుడీ సినిమాని తెలుగులోకి తీసుకురావడం అనందంగా వుంది.  ఆగస్ట్ 26న యూత్ అంతా సినిమా చూసి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News