Friday, November 15, 2024

‘ఘర్ వాపసి‘తో స్వధర్మంలోకి ఆహ్వానం : విహెచ్‌పి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : మతం మారిన హిందువులందరినీ స్వధర్మంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ప్రలోభాలు.. అనేక కారణాలు.. వల్ల హిందూ ధర్మం నుంచి ఇతర మతాలను ఆశ్రయించిన హిందువులందరినీ ‘ఘర్ వాపసి ‘ద్వారా హిందూ ధర్మంలోకి తీసుకువస్తామన్నారు.

వైద్యం, పేదరికం తోపాటు హిందువుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని క్రైస్తవులు, ముస్లింలు మతమార్పిడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ దేశంలోని ప్రతి ఒక్కరూ పుట్టుకతో హిందువులేనని.. గతంలో పరిపాలించిన మొగలాయిలు క్రైస్తవుల ఒత్తిడి తట్టుకోలేక చాలామంది మతమార్పిడి కి గురయ్యారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఖజానా నుంచి ఇమామ్లకు, పాస్టర్లకు జీతాలు ఇస్తూ మతమార్పిడిని పెంచి పోషించడం దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు. ప్రతి హిందువు ఏకమై ఈ ధర్మాన్ని కాపాడే విషయంలో సంకల్పం తీసుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో విశ్వహిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి గుమ్మల్ల సత్యం, రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్, యాది రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర జాదవ్, సుభాష్ చందర్ పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News