Monday, December 23, 2024

ఎన్నికలలో బిజెపికే ప్రజల పట్టం : కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ప్రజలు బిజెపికి పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారని కేంద్రమంత్రి,బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు. శనివారం ఆయన అధ్యక్షతన సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్‌లో బిజెపి ఎమ్మెల్యే ప్రవాస్ వర్క్‌షాప్‌లో కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, అస్సాం, ఒరిస్సా, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి వచ్చిన 119 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఎన్నికలు వస్తేనే పథకాలు గుర్తుకు వస్తాయని ఆరోపించారు. బిజెపి 18 రాష్ట్రాల్లో పాలిస్తుంది అక్కడ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. -తెలంగాణలో అభివృద్ధి కావాలంటే బిజెపి రావాల్సిన అవసరం ఉందన్నారు.

బిజెపి ఎన్నికలకు అన్నిరకాలుగా సిద్దమవుతోందని డికె అరుణ అన్నారు. రాష్ట్రంలో బిఅర్‌ఎస్ చేసిన దోపిడీ, అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని వెల్లడించారు. వారం రోజుల పాటు తెలంగాణలో వివిధ రాష్ట్రాల కు చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి.. -ప్రజల ఆకాంక్షల మీద నివేదికను అందజేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రవాస్ వర్క్‌షాప్ తెలంగాణ ఇన్‌చార్జ్, ఎంపి అప్రజిత సారంగి తెలంగాణ ఎన్నికల ఇన్‌చార్జ్ ప్రకాష్ జవదేకర్, అరవింద్ మీనన్, మధ్యప్రదేశ్ ఇన్‌చార్జ్ మురళీధర్ రావు, జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ, ఈటల రాజేందర్, బంగారు శృతి, ప్రదీప్‌కుమార్,నల్లు ఇంద్రసేనారెడ్డి, బిజెపి జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News