Monday, December 23, 2024

లక్ష ఎక్స్‌యువిలు 700 రీకాల్

- Advertisement -
- Advertisement -

ముంబయి: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహింద్రా అండ్ మహింద్రా భారీ సంఖ్యలో వాహనాలను రీకాల్ చేస్తోంది. ఎక్స్‌యువి700 మోడల్‌కు చెందిన లక్ష యూనిట్లను వెనక్కి రప్పిస్తున్నట్లు తెలిసింది. వాహనంలో వైరింగ్ విషయంలో లోపాలను గుర్తించామని, తగు మార్పులు చేసి వినియోగదారులకు తిరిగి అప్పగిస్తామని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. 2021 జూన్ 8నుంచి 2023 జూన్ 28 మధ్య తయారైన 1,08,306 యూనిట్ల కార్లలోని ఇంజిన్ బేలో వైరింగ్ లూమ్ రూటింగ్‌లోని లోపాల కారణంగా సమస్యలు తలెత్తే అవకాశాలున్నట్లు గుర్తించినట్లు మహింద్రా తెలిపింది. దీంతో పాటు కొన్ని ఎక్స్‌యువి 400 ఎస్‌యువిలను కూడా రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

ఎక్స్‌యువి400 వాహనాల్లో బ్రేక్ పొటెన్షియో మీటర్‌లో స్ప్రింగ్ రిటర్న్‌యాక్షన్‌లో లోపాలు ఉండే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఈ కార్లు కొనుగోలు చేసిన వినియోగదారులకు అదనంగా ఎలాంటి రుసుము లేకుండానే మరమ్మతులు చేసి ఇస్తామని తెలిపింది. స్వచ్ఛందంగానే రీకాల్ చేపడుతున్నామని, కార్ల యజమానులకు వ్యక్తిగతంగా సమాచారం అందుతుందని తెలిపింది. ఇటీవల మారుతీ సుజుకీ ఇండియా కూడా పెద్ద ఎత్తున కార్లను రీకాల్ చేసిన విషయం తెలిసిందే.తన ఎస్‌ప్రెస్సోకో మోడళ్లకు చెందిన 87,599యూనిట్ల వాహనాలను వెనక్కి రప్పించింది. స్టీరింగ్ టై రాడ్‌లో లోపాన్ని సరి చేయడానికి సంస్థ ఈ రీకాల్ చేపట్టింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News