మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదివారం సూర్యాపేటలో పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఈసందర్భంగా ఉదయం 10.35గంటలకు సీఎం కేసీఆర్ బయలు దేరి 10.40గంటలకు బేగం పేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 10.45 గంటలకు హెలికాప్టర్‌లో సూర్యపేటకు బయలు దేరి 11.15గంటలకు సూర్యపేటకు చేరుకుంటారు. 11.20 గంటలకు ఎస్వీ డిగ్రీ కళాశాలకు చేరుకుంటారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.20గంటలకు బయలు దేరి సూర్యపేటలో కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్‌ను కూడా కేసీఆర్ ప్రారంభిస్తారు.అలాగే 12.25గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకుని కొత్తగా నిర్మించిన కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం 12.50గంటలకు సూర్యాపేట బిఆర్‌ఎస్ కార్యాలయానికి చేరుకుంటారు. మ. 1.10గంటలకు పార్టీ కార్యాలయం నుంచి బయలు దేరి 1.25గంటలకు జిల్లా కార్యాలయానికి చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం ౩గంటలకు సూర్యాపేట మార్కెట్ వద్ద జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. తిరిగి 4.45 గంటలకు ఎస్వీడిగ్రీ కాలేజీకి చేరుకుంటారు. అనంతరం 4.50 గంటలకు హెలికాప్టర్ బయలు దేరి 5.20 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రగతి భవన్‌కు బయలు దేరతారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షించాలని జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు అందాయి.