- Advertisement -
న్యూఢిల్లీ : కొలీజియం ప్రతిపాదిత న్యాయమూర్తుల నియామకాలపై ఎంతకాలంలోగా కేంద్రం స్పందిస్తుంది. నియామక ప్రకటన వెలువరిస్తుంది? అనేది తేల్చాలని సుప్రీంకోర్టు పేర్కొంది . ఈ విషయంలో తమకు అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సాయం అవసరం అని తెలిపింది. సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదనల మేరకు కేంద్రం స్పందనపై ఆదేశాలు వెలువరించాల్సి ఉందని, లేకపోతే జడ్జిల నియామకాలు ఎప్పుడు జరుగుతాయో తెలియని స్థితి ఉందని
దాఖలు అయిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తి జెబి పార్ధీవాలాతో కూడిన ధర్మాసనం శనివారం స్పందించింది. సీనియర్ న్యాయవాది హరీష్ విభోర్ సింఘాల్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ పూర్తికి కేంద్రం స్పందనకు సంబంధం ఉందని తెలిపిన ధర్మాసనం కొలీజియం సిఫార్సులపై కేంద్రం నుంచి నియామకాల ప్రక్రియ గడువు ముందు తేల్చాల్సి ఉందని తెలిపారు.
- Advertisement -