Sunday, January 19, 2025

అక్టోబర్ 6వ తేదీన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ !

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో 70 సీట్లను కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలువబోతుంది 
టిపిసిసి మాజీ చీఫ్, ఎంపి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ 6వ తేదీన విడుదల కాబోతుందని టిపిసిసి మాజీ చీఫ్, ఎంపి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణలో 70అసెంబ్లీ సీట్లను కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలువబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శనివారం జరిగిన టిపిసిసి విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతు తెలంగాణలో బిజెపి పోటీలోనే లేదన్నారు.

కాంగ్రెస్ టికెట్ ఆశావహులంతా ప్రజల్లో తిరగాలన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను గమనించే సిఎం కెసిఆర్ ఇటీవల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. టికెట్ వస్తేనే పని చేస్తామడం సరికాదని, ఆశావహులంతా ప్రజల్లో తిరగాలని ఆయన సూచించారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజావ్యతిరేకత ఉందని, అధికార పార్టీ ఎమ్మెల్యేల అవినీతిని, అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News