ఖమ్మం: అధికార బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితా వెల్లడికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ టిక్కెట్ల కోసం పోటీ నెలకొంది. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. వైరా టికెట్ మళ్లీ తనకే వస్తుందని ఎమ్మెల్యే రాములు నాయక్ సైలెంట్ గా ఉండగా.. మాజీ ఎమ్మెల్యేలు మదన్ లాల్, బానోతు చంద్రావతి తమకే వస్తుందని తమ అనుచరులతో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో మదన్‌లాల్‌కు టికెట్ కావాలని గట్టిగా ప్రచారం చేస్తున్న మదన్‌లాల్ మద్దతుదారులకు ఊహించని దెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ రసలీల ఫోటోలు వైరల్‌గా మారాయి.
వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు ప్రస్తుతం అక్కడి వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా ఖాతాల్లో హల్ చల్ చేస్తున్నాయి. అలాంటి వ్యక్తికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తారా? ప్రత్యర్థి వర్గాలు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అయితే.. మదన్‌లాల్ బంధువులు మాత్రం ఫొటోలను మార్ఫింగ్ చేశారని, బీఆర్‌ఎస్ నాయకత్వం మదన్‌లాల్‌కు టికెట్ ఇస్తుందని ఆరోపిస్తున్నారు. ఆ అవసరం తమకు లేదని రాములు నాయక్ వర్గం అంటోంది. రసలీల ఫోటోల వ్యవహారంపై మదన్‌లాల్ నేరుగా స్పందించాల్సి ఉంది.