Sunday, December 22, 2024

సూర్యాపేటలో కెసిఆర్ పర్యటన.. మెడికల్ కాలేజీని ప్రారంభించిన సిఎం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిఎం కెసిఆర్ సూర్యాపేటలో ఆదివారం పర్యటిస్తున్నారు. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా హెలికాప్టర్‌లో సూర్యాపేట చేరుకున్న సీఎం.. తొలుత రూ.కోటితో నిర్మించిన వైద్య కళాశాల ప్రధాన భవనాలను ప్రారంభించారు. 500 కోట్లు, రూ. అనంతరం పాత వ్యవసాయ మార్కెట్ లో రూ.30.18 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్ ను ప్రారంభించారు. ఆ తర్వాత మళ్లీ మార్కెట్ మొత్తాన్ని పరిశీలించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి జగదీశ్ రెడ్డి, సూర్యాపేట జిల్లా ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, సానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్ తదితరులు ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా 20 ఎకరాల్లో రూ.38.50 కోట్లతో నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకుంటారు.

అనంతరం సమీపంలో నిర్మించిన బీఆర్ ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి, జిల్లా కేంద్రంలో రూ.50 కోట్లతో 21 ఎకరాల్లో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు. అక్కడ జిల్లా అధికారులతో సమీక్షించిన అనంతరం సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారు. కాగా, సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News