Friday, November 22, 2024

మాలిలో తిరుగుబాటుదారుల కాల్పులకు 21 మంది మృతి

- Advertisement -
- Advertisement -

బమాకో: పశ్చిమాఫ్రికా లోని మాలిలో తిరుగుబాటుదారులు దారుణానికి తెగబడ్డారు. సెంట్రల్ మాలి లోని మోప్టి ప్రాంతంలో ఒక గ్రామంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 21 మంది గ్రామస్థులు మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడినట్టు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. మరణించిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నట్టు సమాచారం. శనివారం మధ్యాహ్నం సాయుధులైన తిరుగుబాటుదారులు బండియాగరా పట్టణ సమీపం లోని యూరౌ గ్రామం లోకి ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.

2012 లో ట్యురెగ్ వేర్పాటువాదుల తిరుగుబాటు తర్వాత మాలి దేశం అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ మూలాలు కలిగిన ఉగ్రవాదుల దాడులతో సతమతమవుతోంది. అప్పటినుంచి తిరుగుబాటుదారులు సహేల్‌ప్రాంతం లోని భూభాగాలను ఆక్రమించి తమ ప్రాబల్యాన్ని ఇతర దేశాలకు విస్తరించారు. ఇప్పటిదాకా తిరుగుబాటుదారులు జరిపిన కాల్పుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది జూన్‌లో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళాలు మాలి నుంచి వెనుదిరగడంతో దేశం లోని శాంతి భద్రతలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News