Sunday, December 22, 2024

కాంగ్రెస్‌కు 50 ఏళ్లు అధికారం ఇస్తే ఏం అభివృద్ధి చేశారు: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకున్నామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. సూర్యాపేటలో జిల్లా కలెక్టరేటును ప్రారంభించుకున్నందుకు కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు. సూర్యాపేటలో ప్రగతి నివేదన సభకు సిఎం కెసిఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కెసిఆర్ ప్రసంగించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఉద్యోగులు అద్భుతంగా పని చేస్తున్నారని కొనియాడారు. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, తలసరి ఆదాయం వినియోగంలోనూ తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందని ప్రశంసించారు. అందరి కృషితోనే రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తోందని, ఇవాళ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా, సగౌరవంగా బతుకుతున్నారని, సూర్యాపేట మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.25 కోట్లు, జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున ప్రత్యేక నిధులు ఇచ్చామని కెసిఆర్ గుర్తు చేశారు.

Also Read: చనిపోయిన బాలుడు స్మశానంలో బతికాడు!

సూర్యాపేటలో స్పోర్ట్ స్కూల్ మంజూరుకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని, తండాలన్నింటిని గ్రామ పంచాయతీలుగా మార్చుకున్నామన్నారు. కాంగ్రెస్‌కు 50 ఏళు అధికారం ఇస్తే ఏం అభివృద్ధి చేశారని కెసిఆర్ ప్రశ్నించారు. భువనగిరి, నల్గొండ, సూర్యాపేటలో మెడికల్ కాలేజీ పెట్టాలని ఆలోచన కాంగ్రెసోళ్లు ఎప్పుడైనా చేశారా? అని అడిగారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఒక్క అవకాశం ఇవ్వాలని అంటున్నాయని, ఎన్నికలు వస్తున్నాయని విపక్షాలు డ్రామాలు మొదలు పెట్టాయని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నారా? అని కెసిఆర్ అడిగారు. ఎన్నికల రాగానే కాంగ్రెసోళ్లు నాలుగు వేలు ఇస్తామని నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. సూర్యాపేటలో అద్భుతమైన కలెక్టరేట్, ఎస్‌పి కార్యాలయాన్ని నిర్మించుకున్నామని, రైతు రుణమాఫీకి మంత్రి జగదీష్ రెడ్డి పట్టుబట్టి చేయించారని కెసిఆర్ కొనియాడారు. బిఆర్‌ఎస్‌లో చాలా అద్భుతంగా ప్రజల మధ్య ఉండి పని చేసే నాయకులు ఉన్నారన్నారు. రూ.25 లక్షలతో సూర్యాపేటకు కళాభారతి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News