Sunday, November 24, 2024

మహబూబ్‌నగర్లో వెలుగు చూసిన శిలాయుగపు రేఖా చిత్రం

- Advertisement -
- Advertisement -
  • మూసాపేటలో 4వేల సంవత్సరాల నాటి రేఖా చిత్రం గుర్తింపు
  • మూసాపేటలో బయటపడిన ఆదిమానవుని ఆనవాళ్లు
  • ఆనవాళ్లను కాపాడుకోవాలి : ఈమని శివనాగిరెడ్డి

మహబూబ్‌నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలో ఆదిమానవుని ఆనవాళ్లు వెలుగు చూశాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ , సిఈఓ, డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. మూసాపేటలోని రామస్వామి గుట్టపై గల రామలింగేశ్వర ఆలయ సమగ్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయడం కోసం, గ్రామస్తుల ఆహ్వానంపై ఆయన జరిపిన అన్వేషణలో కొండ శిఖరంపై ఒక బండపైన కొత్త రాతియుగపు ఎద్దు బొమ్మ రేఖా చిత్రం అనుకోకుండా కనిపించిందని ఆయన చెప్పారు.

నేలమట్టం నుంచి 400 అడుగులు ఎత్తు ఉన్న రామస్వామి గుట్ట శిఖరాన గల రెండు మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు, ఆరు మీటర్ల మందం గల ఒక బండపై భాగంలో 10 సెంటిమీటర్ల పొడవు, 8 సెంటీమీటర్లు ఎత్తుగల ఎద్దు బొమ్మ రేఖా చిత్రంలో ఎద్దు తల, కొమ్ములు, శరీరం, నాలుగు కాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ఈ బొమ్మ కింద కొన్ని జంతువులు, మానవుల రేఖా కూడా చిత్రాలు ఉన్నాయన్నారు.

పశుపాలన, వ్యవసాయం ముఖ్యవృత్తిగా గల కొత్త రాతియుగపు మానవుడు తాను నిత్యం వాడే రాతి పనిముట్లతో ఆ ఎద్దు బొమ్మను చెక్కి ఉంటాడని గతంలో వెలుగు చూసిన ఇలాంటి ఎద్దు బొమ్మల ఆధారంగా, మూసాపేట రేఖా చిత్రం ఇప్పటికి 4000 సంవత్సరాల నాటిదని, ఎండకు ఎండి, వానకు తడిచి, కొంత స్పష్టత కోల్పోయిందని, పురావస్తు, చారిత్రక ప్రాధాన్యత గల ఈ ఎద్దు బొమ్మ రేఖా చిత్రాన్ని కాపాడుకోవాలని గ్రామస్తులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్‌శెట్టి, భాస్కర్‌గౌడ్, స్థపతి వెంకటరెడ్డి, విశ్వేశ్వర్ , కొండయ్య పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News