Monday, January 20, 2025

లడఖ్ ప్రమాదంలో తెలంగాణ ఆర్మీ జవాన్ మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : లడఖ్‌లో శనివారం జరిగిన ప్రమాదంలో 9 మంది ఆర్మీ సైనికులు చనిపోయిన విషయం విదితమే. కాగా చనిపోయిన వారిలో తెలంగాణకు చెందిన జవాను కూడా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం తంగేళ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తీర్మాన్ దేవునిపల్లికి చెందిన ఆర్మీ జవాన్ చంద్రశేఖర్ మృతిచెందాడు. పేద కుటుంబానికి చెందిన మల్లయ్య, శివమ్మకు ముగ్గురు సంతానం. వారిలో చంద్రశేఖర్ అందరి కంటే చిన్నవాడు. కాగా చంద్రశేఖర్ మృతితో షాద్ నగర్‌లో విషాదం నెలకొంది. ఆర్మీ జవాన్లు వెళ్తున్న వాహనం లేహ్‌లో ప్రమాదవశాత్తు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తొమ్మిది మంది సైనికులు వీరమణం పొందారు. దక్షిణ లడఖ్‌లోని నియోమాలోని ఖేరి వద్ద శనివారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News